![]() |
![]() |
.webp)
శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం శివరాత్రి స్పెషల్ గా శంభో శివ శంభో కాన్సెప్ట్ తో వచ్చింది. ఇందులో డాన్స్, సాంగ్స్, ఇంకా స్పెషల్ సెగ్మెంట్స్ చాలా ఉన్నాయి. ఇక నాటీ నరేష్ సెగ్మెంట్ ఫుల్ జోష్ తో నవ్వు తెప్పించింది. ఈ సెగ్మెంట్ లో ఇంకో విషయం కూడా బయటపడింది. రష్మీ పార్ట్ టైం జాబ్ చేస్తుందన్న విషయాన్నీ నరేష్ చెప్పేసాడు. అదేంటో చూద్దాం. ఐతే ఈ మధ్యకాలంలో మహాకుంభ మేళాకు మోనాలిసా అనే తేనే కళ్ళ అమ్మాయి పూసలమ్ముతూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. ఆమె గెటప్ తో నాటీ నరేష్ వచ్చి ఈ సెగ్మెంట్ లో అందరినీ నవ్వించాడు. ఆ అమ్మాయిలాంటి డ్రెస్ పూసలు వేసుకొచ్చి "నాలో ఊహలకు " అనే సాంగ్ పాడుతూ కింద పడి డాన్స్ చేస్తూ నవ్వించాడు నరేష్. ఇక పూసల దండల్ని కూడా తనకు నచ్చిన ఇంద్రనీల్ కి , సింగర్ ధనుంజయ్ మెడలో వేసాడు. తరవాత నరేష్ తో కలిసి రామ్ ప్రసాద్ పంచ్ ప్రసాద్ కూడా జోక్స్ వేశారు. "మోనాలిసా నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీలో పూసలమ్ముతున్నావ్ కదా...మరి మహాకుంభా మేళాలో ఎవరు అమ్ముతున్నారు" అంటూ పంచ్ ప్రసాద్ నరేష్ ని అడిగాడు.
"మహాకుంభ మేళాలో రష్మీ పూసలమ్ముతుంది." అనేసరికి ప్రసాద్ షాకయ్యాడు. "రష్మీ పూసలమ్ముతుందా" అన్నాడు. "అవును ఇంతకు ముందు ఇద్దరం పూసలమ్మేవాళ్ళం తెలుసా"? అన్నాడు వంకర్లు తిరుగుతూ. "హే అట్లాంటివి బయటకు చెప్పకూడదు.. అది నా పార్ట్ టైం జాబ్" అని సీరియస్ ఫేస్ తో చెప్పింది రష్మీ . "సరే మోనాలిసా నీకు ఈ ముత్యాలు ఎక్కడినుంచి వస్తాయి" అని పంచ్ ప్రసాద్ అడిగేసరికి "నవ్వితే ముత్యాలు రాలతాయి అంటారు అవన్నీ నా నవ్వుల ముత్యాలే" అన్నాడు నరేష్. "ఇలాంటి జోక్స్ వేస్తె పళ్ళు రాల్తాయి" అన్నాడు నూకరాజు. ఇలా ఈ సెగ్మెంట్ లో రష్మీ పూసలమ్ముతూ పార్ట్ టైం జాబ్ చేస్తోందన్న విషయం తెలిసింది. అంటే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే బీడ్స్ సేల్స్ మంచి సంపాదనే అంటున్నారు నెటిజన్స్.
![]() |
![]() |